News June 5, 2024
ఇండోనేషియా ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
ఇండోనేషియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓడారు. చైనీస్ తైపీ ప్లేయర్ సు వెన్‌చి చేతిలో 15-21, 21-15, 14-21తేడాతో పరాజయం పాలయ్యారు. పారిస్ ఒలింపిక్స్ 2024కి ముందు సింధు వరుస ఓటములపై భారత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మలేషియా మాస్టర్స్‌లో సింధు రన్నరప్‌గా నిలిచారు.
Similar News
News January 10, 2025
తెలంగాణకు సం‘క్రాంతి’లేదా?
సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు మెుండిచెయ్యి చూపింది. APకి వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు కేటాయించిన అధికారులు.. తెలంగాణకు మాత్రం ఒక్క రైలూ ప్రకటించలేదు. దీంతో బస్సుల్లో వెళ్లాలంటే రూ.వేలు వెచ్చించాల్సి వస్తుందని వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పండుగకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.
News January 10, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. హరీశ్ తన ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరోసారి విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్‌కు నోటీసులు జారీచేసింది.
News January 10, 2025
ఆదివాసీ నేతలతో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం
TG: ఆదివాసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. తమ సమస్యల్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ‘ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను మంజూరు చేస్తున్నాం. బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తాం. కేస్లాపూర్ జాతరకు నిధుల మంజూరు చేస్తాం. ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం. ఉచితంగా బోర్లు వేస్తాం’ అని CM హామీ ఇచ్చారు.