News January 10, 2025

తెలంగాణకు సం‘క్రాంతి’లేదా?

image

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు మెుండిచెయ్యి చూపింది. APకి వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు కేటాయించిన అధికారులు.. తెలంగాణకు మాత్రం ఒక్క రైలూ ప్రకటించలేదు. దీంతో బస్సుల్లో వెళ్లాలంటే రూ.వేలు వెచ్చించాల్సి వస్తుందని వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పండుగకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.

Similar News

News January 25, 2025

అప్పట్లో.. మామూలు హడావిడి కాదు! కదా..?

image

జెండా పండుగలు 90s కిడ్స్‌కు స్పెషల్ మెమొరీ. ఆటలపోటీలు, క్లాస్ రూం డెకరేషన్, మూలన ఉండే షూ, సాక్స్ వెతికి ఉతికించడం, యూనిఫామ్ ఐరన్, ఎర్లీగా రెడీ, దేశభక్తి నినాదాలతో పరేడ్, జెండావందనం, ప్రసంగం. ఇప్పుడంటే మెడల్స్, ట్రోఫీలు కానీ అప్పట్లో సోప్ బాక్స్, గ్లాసు, గిన్నెలే ప్రైజులు. చివరికి ఇచ్చే బిస్కెట్లు/చాక్లెట్లు ఇంట్లో చూపిస్తే అంత ఫీజు కడితే ఇచ్చేదివేనా? అని మనోళ్ల తిట్లు.
మీ మెమొరీ కామెంట్ చేయండి.

News January 25, 2025

స్టైలిష్ లుక్‌లో రవితేజ.. రేపు గ్లింప్స్

image

మాస్ మహారాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి రేపు ఉ.11.07 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బాను బోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు.

News January 25, 2025

కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు

image

AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.