News June 6, 2024
వాలంటీర్ వ్యవస్థలో మార్పులు.. నిజమెంత?

AP: వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వాలంటీర్ ఉన్నత వర్గాలు తెలిపాయి. దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఫేక్ వార్తలను నమ్మకండని సూచించాయి. కాగా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకొని 1994 నుంచి 2003 వరకు వయోపరిమితిగా నిర్ణయించనున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
Similar News
News December 31, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పతనమై రూ.1,24,550 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 31, 2025
అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.
News December 31, 2025
మహిళలకు అత్యంత అనుకూలమైన దేశం డెన్మార్క్

ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ (WPS) ఇండెక్స్-2025లో మహిళలకు అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్ అగ్ర స్థానంలో నిలిచింది. ఉద్యోగ, ఉపాధితోపాటు ప్రతి రంగంలోనూ ఇక్కడి మహిళలకు విస్తృతమైన అవకాశాలు, భద్రత లభిస్తోంది. లింగవివక్ష, మహిళలపై హింస ఉండవు. కీలక నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం, బలమైన చట్టాలు, సురక్షిత వాతావరణం, ఆరోగ్యం-చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం వంటివి దీన్ని లెక్కించే సూచికలు.


