News June 6, 2024
దేవుడా.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. బ్యాలెట్ పత్రాలపై డబ్బులు పంపాలంటూ ఫోన్ పే నంబర్లు, లవ్ సింబల్స్, జై కాంగ్రెస్, జై కేసీఆర్ నినాదాలు కనిపించాయి. బ్యాలెట్ పేపర్‌లో కేవలం 1,2,3 నంబర్లతో వారి ప్రాధాన్యత ఓట్లు వేసేందుకే అనుమతి ఉంది. డిగ్రీలు చదివిన ఓటర్లు సైతం ఇలా తప్పుగా ఓటేయడం ఏంటని నెట్టింట విమర్శలొస్తున్నాయి.
Similar News
News September 10, 2025
నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే అంతే..

ప్రజలు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయనడానికి మరో నిదర్శనం నేపాల్. తీవ్ర అవినీతి, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు SMపై బ్యాన్ విధించడంతో నేపాలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నుకున్న నేతలనే రోడ్లపై తన్నుకుంటూ తరిమికొట్టారు. PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోయారు. గతేడాది సరిగ్గా ఇలాంటి పరిస్థితులే బంగ్లాలోనూ కనిపించాయి. ప్రజల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె పారిపోయి INDకు వచ్చేశారు.
News September 10, 2025
అక్టోబర్ 2న ‘రాజాసాబ్’ ట్రైలర్: నిర్మాత

అక్టోబర్ 2న విడుదలయ్యే ‘కాంతార: చాప్టర్-1’ సినిమాతో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలోకి రానుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ ఈనెల 12న విడుదలవుతోంది.
News September 10, 2025
దసరా సెలవుల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి

AP: దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి MLC గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండుగ ఈ నెల 22 నుంచే మొదలవుతుందని, ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచే సెలవులు ఇవ్వాలని కోరారు. DSC నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లను పూర్తి చేయాలన్నారు.