News June 7, 2024

లొకేషన్ హిస్టరీని డిలీట్ చేయనున్న గూగుల్

image

యూజర్లు తిరిగిన లొకేషన్లకు సంబంధించిన డేటాను డిలీట్ చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. యూజర్ల పర్సనల్ డేటాను స్టోర్ చేయడం తగ్గిస్తామని గత ఏడాది ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపడుతోంది. లొకేషన్ డేటాను సేవ్ చేసే టైమ్‌లైన్ ఫీచర్‌ ఇకపై యూజర్లు సెలక్ట్ చేసుకుంటేనే పనిచేస్తుందని తెలిపింది. అయితే ఆ డేటా కూడా కంపెనీ సర్వర్లలో స్టోర్ కాదని, కేవలం యూజర్లలో ఫోన్లలోనే స్టోర్ అవుతుందని స్పష్టం చేసింది.

Similar News

News November 29, 2024

ఈనాటి ముఖ్యాంశాలు

image

* సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం చంద్రబాబు
* కులగణన సర్వేలో పాల్గొన్న సీఎం రేవంత్
* అదానీపై జగన్ కీలక వ్యాఖ్యలు
* మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు
* పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్స్ ఎత్తివేత
* ఎల్లుండి తెలంగాణ బంద్
* వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదు: సుప్రీంకోర్టు
* ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో రోహిత్ శర్మ ప్రసంగం
* అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధార్థ్ కౌల్ రిటైర్మెంట్

News November 29, 2024

తెలుగు టైటాన్స్ విజయం

image

ప్రో కబడ్డీ లీగ్‌లో యూ ముంబాతో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 41-35 పాయింట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. TTలో ఆశిష్, విజయ్ చెరో 10 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్(48) రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో హరియాణా స్టీలర్స్(56) కొనసాగుతోంది.

News November 29, 2024

నిద్ర రాకముందే బెడ్రూంలోకి వెళ్తున్నారా?

image

చాలామంది నిద్రరాకముందే బెడ్రూంలోకి వెళ్లి బలవంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే ఒత్తిడి పెరిగి నిద్ర రావడం మరింత ఆలస్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే నిద్ర వచ్చే వరకు న్యూస్ పేపర్, బుక్స్ చదవడం చేయాలంటున్నారు. నిద్ర వచ్చినప్పుడే బెడ్రూంలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. త్వరగా నిద్రపట్టేందుకు సా.4 తర్వాత టీ, కాఫీ దూరంపెట్టాలంటున్నారు. డైలీ అరటిపండ్లు తినాలని చెబుతున్నారు.