News June 7, 2024
టీచర్ల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మల్టీ జోన్-1లో ఈనెల 22 వరకు, మల్టీ జోన్-2లో ఈనెల 30 వరకు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు చేపట్టనుంది. పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఆగిపోయిన దగ్గరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. TETతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించనుంది.
Similar News
News February 4, 2026
చెత్త ఏరుకునే వారిలో SCలే అధికం: కేంద్రం

సామాజికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులపై కేంద్రం చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో 1.52 లక్షల మంది చెత్త ఏరుకునేవారు ఉన్నారని, వీరిలో దాదాపు 84.5% మంది SC, ST, OBC సామాజిక వర్గాలకు చెందినవారేనని తేలింది. వీరిలో SCలు 60.3%, OBCలు 13.7%, OCలు 10.7%, STలు 10.5% ఉన్నారు. వీరందరికీ సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సేకరించింది.
News February 4, 2026
కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదు: KTR

TG: మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ <<19051424>>వాడిన<<>> భాషను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. హార్వర్డ్‌లో ఎన్ని కోర్సులు చేసినా రేవంత్ తన భాషను మార్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన KCR వంటి నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజవదంటూ మండిపడ్డారు.
News February 4, 2026
వార్మప్ మ్యాచ్.. SAకి భారీ టార్గెట్

సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20WC వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(53), తిలక్ వర్మ(45), అక్షర్ పటేల్(35), సూర్యకుమార్(30), పాండ్య(30) రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్, కోర్బిన్, అన్‌రిచ్, మఫాకలు తలో వికెట్ తీశారు. విజయం కోసం SA బ్యాటర్లు 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి.


