News June 7, 2024
టీచర్ల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల
TG: రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మల్టీ జోన్-1లో ఈనెల 22 వరకు, మల్టీ జోన్-2లో ఈనెల 30 వరకు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు చేపట్టనుంది. పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఆగిపోయిన దగ్గరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. TETతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించనుంది.
Similar News
News December 10, 2024
మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
News December 10, 2024
మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.
News December 10, 2024
అతిగా నిద్రపోతున్నారా?
పెద్దవారికి రోజుకు 7-8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నిద్ర గుండెకు చేటు చేస్తుందని, వెన్నునొప్పి వస్తుందని అంటున్నారు. దీంతో పాటు టైప్-2 మధుమేహానికి కారణమవుతుందట. ఎక్కువ సమయం నిద్రలో ఉంటే ‘సెరెటోనిన్’ స్థాయులు తగ్గి మైగ్రేన్ వంటి సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు. 9గంటలకు పైగా నిద్రపోయి లేస్తే బద్ధకం ఆవరించి ఆ రోజంతా అలసటగా ఉంటుందట. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో కామెంట్ చేయండి.