News June 7, 2024
PIC OF THE DAY

ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని మోదీ రాష్ట్రపతిని కోరారు. ఈ సందర్భంగా మోదీకి అభినందనలు తెలిపిన ద్రౌపదీ ముర్ము.. ఆయనకు తియ్యటి పెరుగు తినిపించారు. సంప్రదాయబద్ధంగా ఈ పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఇది PIC OF THE DAY అని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గతంలో మోదీకి అప్పటి రాష్ట్రపతి కోవింద్ స్వీట్ తినిపించారు.
Similar News
News January 20, 2026
ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 20, 2026
‘మాఘం’ అంటే మీకు తెలుసా?

చాంద్రమానం ప్రకారం 11వ నెల మాఘ మాసం. మఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే నెల కాబట్టి దీనికి ‘మాఘం’ అని పేరు వచ్చింది. ‘మఘం’ అంటే యజ్ఞం అని అర్థం. బ్రహ్మాండ పురాణం ప్రకారం.. రుషులు యజ్ఞయాగాదులు నిర్వహించడానికి ఈ మాసాన్ని అత్యంత శ్రేష్ఠమైనదిగా ఎంచుకున్నారు. ఇది శివకేశవులకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రీ పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి వంటి గొప్ప పండుగలు ఈ మాఘ మాసంలోనే వస్తాయి.
News January 20, 2026
బరువు తగ్గాలా.. ఈ 3 రూల్స్ పాటించండి!

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ 3 రూల్స్ పాటించడం ముఖ్యమని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 1.డోంట్ గివప్: జిమ్/డైట్ విషయంలో ఏదో చిన్న పొరపాటు జరగ్గానే మొత్తానికే మానేయకండి. 2.టైమ్‌లైన్: ఓవర్ నైట్‌లో సన్నబడాలన్న మైండ్ సెట్ మారాలి. ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని అర్థం చేసుకోవాలి. 3.సాకులు వెతకొద్దు: జిమ్/డైట్ చేయలేనంత బిజీగా ఉన్నామని చెప్పొద్దు. మీ ప్రయారిటీ ఏంటో ఫిక్స్ చేసుకోవాలి.


