News June 7, 2024

PIC OF THE DAY

image

ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని మోదీ రాష్ట్రపతిని కోరారు. ఈ సందర్భంగా మోదీకి అభినందనలు తెలిపిన ద్రౌపదీ ముర్ము.. ఆయనకు తియ్యటి పెరుగు తినిపించారు. సంప్రదాయబద్ధంగా ఈ పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఇది PIC OF THE DAY అని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గతంలో మోదీకి అప్పటి రాష్ట్రపతి కోవింద్ స్వీట్ తినిపించారు.

Similar News

News December 14, 2024

జీవో 317 సమస్యను పరిష్కరించండి: ఉపాధ్యాయులు

image

TG: జీవో 317 సమస్యను పరిష్కరించి తమను సొంత జిల్లాలకు పంపాలని బాధిత ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. స్థానికత ఆధారంగా తమను బదిలీ చేయాలని కోరారు. HYDలోని ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద పలువురు ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని విన్నవించారు.

News December 14, 2024

ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు(PHOTO)

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ED వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అని ఓ కోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో పాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది.

News December 14, 2024

వైసీపీ నిరసనలు శుక్రవారం మాత్రమే: మంత్రి సత్యకుమార్

image

AP: వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్విటర్లో సెటైర్లు వేశారు. ‘డిసెంబర్ 13న శుక్రవారం, డిసెంబర్ 27న శుక్రవారం, జనవరి 3న శుక్రవారం. తమ నిరసనలు, పోరుబాటల్లాంటి రాజకీయ కార్యకలాపాలకు ప్రతీ వారం కేవలం “శుక్రవారం” రోజునే వైసీపీ ఎన్నుకోవడం పూర్తిగా యాదృచ్ఛికమే. ఎటువంటి మతలబు లేదు. సాకులు చూపే ఉద్దేశం అసలే లేదు’ అని పేర్కొన్నారు. దానికి జైలు పక్షి అని హాష్‌ట్యాగ్ జతచేయడం గమనార్హం.