News June 8, 2024
‘మోదీ స్టాక్స్’ ఇంకా కోలుకోలేదు!
ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి స్టాక్ మార్కెట్ కోలుకుంటున్నా ‘మోదీ స్టాక్స్’ ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థ CLSA పేర్కొన్న ఈ 54 స్టాక్స్‌లో 8 మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌కు ముందున్న (జూన్ 1కు ముందు) స్థాయికి చేరుకున్నాయి. వీటిలో కొన్ని మే 31తో పోలిస్తే ఇంకా 10శాతానికిపైగా నష్టాల్లో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా మోదీ స్టాక్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, HAL, SBI తదితర సంస్థలు ఉన్నాయి.
Similar News
News November 29, 2024
గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి
TG: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది. రోటిగూడ గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నాలుగో తరగతి చదువుతున్న కూతురు సమన్విత(10) గురువారం ఉదయం ఛాతీ నొప్పితో కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
News November 29, 2024
ఇదే బౌలింగ్ అటాక్ కొనసాగించండి: పుజారా
BGTలో ఆడిలైడ్ పింక్ బాల్ టెస్ట్‌కు సిద్ధమవుతోన్న టీమ్‌ఇండియాకు క్రికెటర్ పుజారా సలహా ఇచ్చారు. తొలి టెస్ట్‌లో సక్సెస్ అయిన బౌలింగ్ అటాక్‌నే కొనసాగించాలన్నారు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాలనే మరోసారి ఎంపిక చేయాలని సూచించారు. బుమ్రా ప్రణాళికలను అమలు చేస్తూ వారిద్దరూ వికెట్లు సాధిస్తున్నట్లు చెప్పారు. అటు, KL రాహుల్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలని, ఓపెనర్‌గా లేదా వన్‌డౌన్‌లో పంపితే బాగుంటుందన్నారు.
News November 29, 2024
500 కేజీల డ్రగ్స్ పట్టివేత
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారత నేవీ 500 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకుంది. ఫిషింగ్ బోట్లలో డ్రగ్స్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీతో కలిసి భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది.