News June 8, 2024
జగన్ ప్రభుత్వం నా ఫోన్లను ట్యాప్ చేసింది: లోకేశ్

AP: YCP ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసి, ఆపై ఆధారాలను ధ్వంసం చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ‘దీనిపై నాకు స్పష్టమైన సమాచారం అందింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం మాకందరికీ తెలుసు. నా ఫోన్‌పై పెగాసస్ దాడి జరిగిందని గతంలో చెప్పాను. నా ఫోన్‌పై రెండుసార్లు పెగాసస్ అటాక్ జరిగిందనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చివరగా ఏప్రిల్‌లో అటాక్ అయింది’ అని ANI ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News September 10, 2025
సబిత, సునీత కాంగ్రెస్‌లో చేరట్లేదు: బీఆర్ఎస్ నేత కార్తీక్

TG: బీఆర్ఎస్ MLAలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబిత కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి(యూట్యూబ్ ఛానెల్స్) లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.
News September 10, 2025
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.
News September 10, 2025
18ఏళ్లకే 7 ప్రపంచ రికార్డులు

ఐస్‌లింబో స్కేటింగ్‌లో గిన్నిస్‌రికార్డు సాధించిన మొదటిఅమ్మాయిగా సృష్టిశర్మ చరిత్ర సృష్టించారు. నాగ్పూర్‌కు చెందిన సృష్టి ఇప్పటివరకు 7సార్లు గిన్నిస్‌రికార్డులో చోటు సాధించారు. తాజాగా లింబోస్కేటింగ్‌లో 50మీటర్లను 7.46 సెకన్లలో పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశారు. సేవ్ ది గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ అంబాసిడరైన ఆమె తన రికార్డుల ద్వారా వచ్చిన డబ్బును బాలికల శ్రేయస్సుకు కేటాయిస్తున్నారు.