News June 9, 2024

కూటమికి 57%, వైసీపీకి 28% పోస్టల్ ఓట్లు

image

AP: రాష్ట్రంలోని 25 MP సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా, ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా NDAకు 2.86 లక్షలు(57.10%), YCPకి 1.41 లక్షలు(28.11%), ఇండియా కూటమికి 30,386(6.05%) ఓట్లు దక్కాయి. దీన్నిబట్టి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలకు నమోదైన పోస్టల్ ఓట్ వివరాలను పైన ఫొటోలో చూడొచ్చు.

Similar News

News October 7, 2024

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

image

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.

News October 7, 2024

భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్

image

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.

News October 7, 2024

గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన

image

INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.