News January 12, 2025
యువతకు స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద
భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. దేశ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో ఆయన నిరంతరం కృషి చేశారు. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువతే దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు. ఆయనకు గౌరవ సూచకంగా వివేకానంద జయంతి(JAN 12)ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.
Similar News
News January 17, 2025
దేశం గర్వించేలా మరింత కష్టపడతా: మనూ భాకర్
ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్, భారత షూటర్ మనూ భాకర్ స్పందించారు. ‘గౌరవ రాష్ట్రపతి నుంచి ఖేల్ రత్న అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా చేసేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి, విజయాలు పొందేందుకు స్ఫూర్తినిస్తోంది. నాకు మద్దతునిచ్చిన, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
News January 17, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. AP అభివృద్ధి పట్ల NDAకి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు.
News January 17, 2025
పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక ప్రకటన
AP: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు. ‘వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు. BPL ఫ్యామిలీ అయి ఉండాలి. కచ్చితంగా ఆధార్ ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు’ అని పేర్కొన్నారు.