News June 9, 2024
కేంద్ర పదవుల్లో ఉత్తరాంధ్రకు పెద్దపీట
TDP మద్దతుతో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ సమయాల్లో ఉత్తరాంధ్రకు ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. 1996లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడుకి అవకాశం ఇచ్చింది. 2014 NDA సర్కారులో విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు పౌరవిమానయాన శాఖా మంత్రిగా పని చేశారు. తాజాగా మోదీ 3.0 ప్రభుత్వంలో శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది.
Similar News
News January 12, 2025
నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.
News January 12, 2025
యువతకు స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద
భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. దేశ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో ఆయన నిరంతరం కృషి చేశారు. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువతే దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు. ఆయనకు గౌరవ సూచకంగా వివేకానంద జయంతి(JAN 12)ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.
News January 12, 2025
నేడు అరకు లోయకు సుప్రీంకోర్టు జడ్జిలు
AP: సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నాతో సహా 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకులోయలో పర్యటించనుంది. వీరంతా విశాఖపట్నం నుంచి రైలులో ఉదయం 10.30 గంటలకు అరకు లోయకు చేరుకోనున్నారు. గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం బొర్రా గుహలను సందర్శించనున్నారు. వీరి రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.