News June 9, 2024
సంబరాలు చేసుకోండి: కిషన్ రెడ్డి
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని BJP రాష్ట్రాధ్యక్షుడు, MP కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందని, సంకల్ప పత్రం పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Similar News
News January 12, 2025
రిటైర్ అవ్వాలనుకుని.. వెనక్కి తగ్గిన రోహిత్?
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో రిటైర్ కావాలని భావించారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. మెల్‌బోర్న్ టెస్టు ప్రదర్శన అనంతరం టెస్టుల నుంచి తప్పుకోవాలని రోహిత్ అనుకున్నారు. కానీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. ఆయన మనసు మార్చుకోవడాన్ని కోచ్ గంభీర్ హర్షించకపోవడంతో ఆఖరి టెస్టుకు శర్మ వైదొలగినట్లు తెలుస్తోంది.
News January 12, 2025
విటమిన్-డి లభించే ఆహారమిదే..
శరీరంలో రోగనిరోధక శక్తి కోసం విటమిన్-డి చాలా అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఎండలోకి వెళ్లక కొందరిలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అలాంటి వారు విటమిన్-డి లభించే ఆహారం తీసుకోవడం వల్ల దానిని అధిగమించవచ్చు. పుట్ట గొడుగులు, గుడ్డు పచ్చసొన, ఆరెంజ్ జ్యూస్, సాల్మన్ చేప, పాల ఉత్పత్తులు, పొద్దుతిరుగుడు గింజలు, నెయ్యి వంటివి తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి.
News January 12, 2025
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇది వర్తిస్తుందని, ఆలోపు రిటైర్ అయ్యేవారికి కుదరదని తెలిపింది. అర్హత కలిగిన వారు ఈ నెల 15 నుంచి 31 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా.. ప్రైవేటీకరణలో భాగంగానే మేనేజ్‌మెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆరోపించింది.