News June 9, 2024
కీలక పోరుకు ముందు స్టార్ ప్లేయర్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్
మరికొన్ని గంటల్లో భారత్, పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుండగా పాకిస్థాన్ కీలక ప్లేయర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. కుడి పక్కటెముక గాయంతో అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసిమ్ ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యారని పాక్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తెలిపారు. భారత్‌తో మ్యాచ్‌లో బ్యాటర్ ఆజం ఖాన్ స్థానంలో ఆల్‌రౌండర్ ఇమాద్‌ను పాక్ తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది.
Similar News
News January 12, 2025
గ్రీన్ కో సభ్యులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ
కర్నూలు జిల్లా పిన్నాపురం పర్యటనలో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో సెల్ఫీ దిగారు. ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కారు డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ చీఫ్ ఆయనకు గ్రీన్ కో కంపెనీ గురించి వివరించారు.
News January 12, 2025
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇది వర్తిస్తుందని, ఆలోపు రిటైర్ అయ్యేవారికి కుదరదని తెలిపింది. అర్హత కలిగిన వారు ఈ నెల 15 నుంచి 31 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా.. ప్రైవేటీకరణలో భాగంగానే మేనేజ్‌మెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆరోపించింది.
News January 12, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ
ఢిల్లీలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బరిలోకి దిగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలుండగా మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్న 10 నుంచి 12 చోట్ల ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో చాందినీ చౌక్, కార్వాన్ నగర్ వంటి కీలక స్థానాలున్నాయి. ఇప్పటికే రెండు స్థానాల్లో ఆ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. వచ్చే నెల 5న ఎన్నికలు జరగనుండగా, అదే నెల 8న ఫలితాల్ని ప్రకటించనున్నారు.