News June 10, 2024

T20 WC: ఎమోషనల్ డ్యామేజ్ చేశారు: ఆనంద్ మహీంద్రా

image

T20WCలో పాక్‌పై భారత్ విజయం సాధించిన తీరుపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘టీమ్ఇండియా లోస్కోరుకే పరిమితం కావడంతో దాయాది చేతిలో ఓటమి తప్పదనే భావనను మాకు కలిగించింది. కానీ తీవ్ర ఒత్తిడిలో మన ప్లేయర్లు విజయాన్ని పాక్ నుంచి లాక్కొని వారికి ఘోర అవమానాన్ని మిగిల్చారు. రోహిత్ సేన ఎదురుదాడి దారుణం. ఆటలో మీరెప్పటికీ హీరోలుగా ఉండాలి. ఇదే నేను మీకు విధిస్తున్న శిక్ష’ అని పేర్కొన్నారు.

Similar News

News September 11, 2025

పవన్ బాపట్ల పర్యటన రద్దు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

News September 11, 2025

నిజమైన ‘శ్రీమంతుడు’!

image

మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ ద్వారా 10వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్‌లు అందించారు. ఒంటరి మహిళలు & వృద్ధులు ఉంటే రూ.5వేలు పంపిణీ చేశారు. అలాగే పశువులకు వైద్యం అందించి మెడిసిన్స్, ఫుడ్స్ ఇస్తున్న అనంత్‌ నిజమైన శ్రీమంతుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News September 11, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్

image

AP: ఈనెల 20లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు పేర్కొంది. రిలీజ్ చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంది. అటు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే కాలేజీలు <<17653923>>బంద్<<>> చేస్తామని ఇటీవల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరించాయి.