News June 10, 2024
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
AP: ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.
Similar News
News January 12, 2025
ఫెన్సింగ్ టెన్షన్: భారత హైకమిషనర్‌కు బంగ్లా సమన్లు
భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్ట్రీ సమన్లు పంపింది. సరిహద్దులోని 5 ప్రాంతాల్లో BSF ఫెన్సింగ్ నిర్మాణం, ఉద్రిక్తతలపై ఆరాతీసినట్టు సమాచారం. ఫారిన్ సెక్రటరీ జాషిమ్ ఉద్దీన్‌తో 3PMకు మొదలైన వర్మ మీటింగ్ 45ని. సాగినట్టు స్థానిక BSS న్యూస్ తెలిపింది. సరిహద్దు వెంట భద్రత, ఫెన్సింగ్, నేరాల కట్టడిపై రెండు దేశాలకు అవగాహనా ఒప్పందాలు ఉన్నాయని, పరస్పరం సహకరించుకుంటాయని వర్మ పేర్కొన్నారు.
News January 12, 2025
రేపు భోగి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో రేపు భోగి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. భోగి మంటల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్రోల్, డీజిల్ లాంటి మండే పదార్థాలను దూరంగా ఉంచాలి. మంట చుట్టూ చేరేవారు కాటన్ దుస్తులు ధరించాలి. శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు మంటలకు దూరంగా ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వీలుగా దగ్గర్లో నీళ్లు, దుప్పట్లు ఉంచుకోవాలి.
News January 12, 2025
హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దు: UP ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ‘నో హెల్మెట్-నో ఫ్యూయెల్’ విధానాన్ని అమలు చేయాలని UP ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ పోయవద్దని బంకులను ఆదేశించింది. పిలియన్ రైడర్ సైతం హెల్మెట్ ధరించాలని పేర్కొంది. ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాలను ఆదేశించింది. ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల UPలో 25,000-26,000 మంది చనిపోతున్నట్లు ఇటీవల CM యోగి తెలిపారు.