News June 10, 2024

రూ.2లక్షల రుణమాఫీ.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: రూ.2లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు రూపొందించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలి. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలి. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలి. AUG 15లోగా రుణమాఫీ చేసి తీరాలి’ అని రుణమాఫీ, వ్యవసాయ శాఖపై సమీక్షలో CM స్పష్టం చేశారు.

Similar News

News September 11, 2025

OTT డీల్స్‌తో బడ్జెట్ రికవరీ!

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈక్రమంలో ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దక్కించుకుంది. ఏకంగా రూ.125కోట్లకు అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు పొందినట్లు టాక్. అలాగే నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ క్రేజ్‌ను వాడుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ₹80కోట్లకు స్ట్రీమింగ్ హక్కులు కొన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో బడ్జెట్‌లో 80% వచ్చేసిందట.

News September 11, 2025

పవన్ బాపట్ల పర్యటన రద్దు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

News September 11, 2025

నిజమైన ‘శ్రీమంతుడు’!

image

మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ ద్వారా 10వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్‌లు అందించారు. ఒంటరి మహిళలు & వృద్ధులు ఉంటే రూ.5వేలు పంపిణీ చేశారు. అలాగే పశువులకు వైద్యం అందించి మెడిసిన్స్, ఫుడ్స్ ఇస్తున్న అనంత్‌ నిజమైన శ్రీమంతుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.