News June 10, 2024
ప్రేయసితో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ వివాహం

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియెల్ వ్యాట్ తన ప్రేయసి జార్జి హోడ్జ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. సుదీర్ఘ కాలం నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జోడీకి భారత మహిళా క్రికెటర్ షఫాలీ, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ అభినందనలు తెలియజేశారు. గతంలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు నాట్ స్కీవర్, కేథరిన్ బ్రంట్ కూడా పెళ్లి చేసుకున్నారు.
Similar News
News February 20, 2026
ఇలా చేస్తే నెలనెలా ఆదాయం.. ట్రై చేయండి!

డబ్బు సురక్షితంగా ఉంటూ నెలనెలా ఆదాయం కోరుకునే వారికి ‘పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్’ ఉత్తమ ఎంపిక. ప్రస్తుతం దీనిపై 7.4% వడ్డీ లభిస్తోంది. ఒక వ్యక్తి గరిష్ఠంగా ₹9 లక్షలు, జంటగా ₹15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ₹9 లక్షల పెట్టుబడికి నెలకు ₹5,550, ₹15 లక్షలకు ₹9,250 వడ్డీ వస్తుంది. దీని కాలపరిమితి 5 ఏళ్లు. ప్రభుత్వ హామీ ఉండటంతో రిస్క్ ఉండదు. మధ్యతరగతి వారు, రిటైర్డ్ వ్యక్తులకు ఇది బెస్ట్.
News February 20, 2026
అభిషేక్.. దొరికిపోతావ్ జాగ్రత్త: అమీర్

టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించారు. అభిషేక్ ప్రతీ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి వీక్‌నెస్ పసిగట్టేస్తారని తెలిపారు. పాక్ ఓపెనర్ ఆయుబ్ తొలినాళ్లలో ఇలాగే ఆడి ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడేందుకు తడబడుతున్నాడని.. అభిషేక్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.
News February 20, 2026
సర్పంచ్‌లకు గుడ్ న్యూస్

AP: సర్పంచ్‌లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో చేసిన తీర్మానాల ప్రకారం నిధులు వాడుకోవచ్చని పేర్కొంది. పనులు చేసిన తర్వాత మెజర్‌మెంట్స్ బుక్స్‌లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించింది.


