News June 10, 2024

ప్రేయసితో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ వివాహం

image

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియెల్ వ్యాట్ తన ప్రేయసి జార్జి హోడ్జ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. సుదీర్ఘ కాలం నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జోడీకి భారత మహిళా క్రికెటర్ షఫాలీ, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ అభినందనలు తెలియజేశారు. గతంలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు నాట్ స్కీవర్, కేథరిన్ బ్రంట్ కూడా పెళ్లి చేసుకున్నారు.

Similar News

News March 3, 2026

ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

image

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.

News March 3, 2026

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

image

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.

News March 3, 2026

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే ఆస్కారముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38°C నమోదైంది.