News June 11, 2024
పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను: KRN
AP: తనకు పౌరవిమానయాన శాఖ కేటాయింపుపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ‘విమానయాన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, చంద్రబాబుకు నా కృతజ్ఞతలు. నా వంతుగా కృషి చేసి దేశంలో పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను’ అని ట్వీట్ చేశారు. మోదీ, చంద్రబాబు ఫొటోలు, తండ్రి ఎర్రన్నాయుడు విగ్రహం ఉన్న ఫొటోను KRN షేర్ చేశారు.
Similar News
News December 26, 2024
వైకుంఠ ఏకాదశి: ఆ పది రోజులు వారికి నో ఎంట్రీ
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9న ఉ.5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని TTD ఈవో శ్యామలరావు చెప్పారు. సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మిగతా తేదీలకు ఒక రోజు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టోకెన్లు లేని వారికి ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు.
News December 26, 2024
కొత్త ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉంది.
News December 26, 2024
నేడు కర్ణాటకకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా బెల్గాంలో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. అందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.