News June 11, 2024
విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి
ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా <<13417665>>విమాన<<>> ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 9, 2025
దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
మలయాళ దిగ్గజ గాయకుడు పి జయచంద్రన్(80) ఈరోజు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్‌కు 5సార్లు కేరళ రాష్ట్ర పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.
News January 9, 2025
మన్ కీ బాత్ వినాల్సిందే: గోవా ప్రభుత్వం
అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా ప్రధాన మంత్రి మన్ కీ బాత్ వినాలని గోవా ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని లేవనెత్తే అంశాలు, సలహాల నుంచి స్ఫూర్తి పొందాలని సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రభుత్వ పాలనను మెరుగుపరిచేందుకు వాటిలో ఉత్తమ విధానాలను అమలు చేయాలని సూచించింది. ప్రగతిశీల పాలనా పద్ధతులను అమలు చేయడంలో గోవా మార్గదర్శకమని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.
News January 9, 2025
బాబాయ్-అబ్బాయ్: ఫిర్ ఏక్ బార్ ఏక్ సాథ్?
శరద్ పవార్-అజిత్ పవార్ వర్గాలు తిరిగి ఏకమవుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రి పదవులు ఆశచూపి శరద్ వర్గం MPలను అజిత్ వర్గం ఆకర్షిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇద్దరూ కలవాలని దేవుణ్ని ప్రార్థించినట్టు అజిత్ తల్లి ఆశాతాయి పేర్కొన్నారు. MPల ఫిరాయింపు, NDAలో చేరికను ఇరు వర్గాలు ఖండిస్తున్నాయి. అయితే కింది స్థాయి నేతలు బలంగా కోరుకుంటున్నారు.