News June 11, 2024
ఇండియా కూటమికి కొత్త తలనొప్పి!

UPలో 43సీట్లతో మంచి ఫలితాలు సాధించినా INDIA కూటమిని ఓ తలనొప్పి వెంటాడుతోంది. కూటమి నుంచి గెలిచిన ఆరుగురు MPలపై కేసులున్నాయి. నేరం రుజువై 2ఏళ్లకు పైగా జైలు శిక్ష పడితే వారి పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుంది. లోక్‌సభలో ఇండియా కూటమి బలం తగ్గుతుంది. BJPకి ప్రయోజనం అవుతుంది. కేసులు ఎదుర్కొంటున్నవారిలో అఫ్జల్ అన్సారీ, ధర్మేంద్రయాదవ్, బాబుసింగ్, రాంభువల్ నిషాద్, వీరేంద్రసింగ్, ఇమ్రాన్ మసూద్ ఉన్నారు.
Similar News
News December 30, 2025
లంకతో చివరి టీ20.. స్మృతి ప్లేస్‌లో 17 ఏళ్ల అమ్మాయి ఎంట్రీ

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న చివరి(5వ) టీ20లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. స్మృతి మంధానకు రెస్ట్ ఇచ్చారు. ఆమె స్థానంలో 17 ఏళ్ల కమలిని తొలి మ్యాచ్ ఆడనున్నారు.
IND: షెఫాలీ, కమలిని, రిచా, హర్మన్, హర్లీన్, దీప్తి, అమన్‌జోత్, స్నేహ్ రాణా, అరుంధతీ రెడ్డి, వైష్ణవి, శ్రీచరణి
SL: పెరెరా, ఆటపట్టు, దులానీ, హర్షిత, దిల్హారి, నీలాక్షిక, రష్మిక సెవ్వండి, నుత్యాంగన, నిమశ, రణవీర, మాల్కి
News December 30, 2025
IPLలో రూ.13కోట్లు.. ENG వరల్డ్‌కప్ టీమ్‌లో నో ప్లేస్

SRH భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు T20 2026 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన IPL మినీ వేలంలో రూ.13కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లీగ్ T20లో బాగా పెర్ఫామ్ చేసిన లియామ్‌ను టీమ్‌లోకి తీసుకోకపోవడంతో SRH యాజమాన్యం, అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. యాషెస్ సిరీస్‌లో విఫలమైన వికెట్ కీపర్ జెమీ స్మిత్‌కూ చోటు దక్కలేదు.
News December 30, 2025
బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18709090>>బేగం ఖలీదా జియా<<>> చనిపోయిన విషయం తెలిసిందే. రేపు ఢాకాలో జరగనున్న ఆమె అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. బంగ్లాతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ప్రధానిగా ఉన్న రెండు పర్యాయాలు చైనాకు బంగ్లాను మరింత దగ్గర చేశారు. అలాగే ఆమె హయాంలోనే బంగ్లాకు చైనా ప్రధాన ఆయుధాల సప్లయర్‌గా నిలిచింది.


