News June 11, 2024
ఇండియా కూటమికి కొత్త తలనొప్పి!

UPలో 43సీట్లతో మంచి ఫలితాలు సాధించినా INDIA కూటమిని ఓ తలనొప్పి వెంటాడుతోంది. కూటమి నుంచి గెలిచిన ఆరుగురు MPలపై కేసులున్నాయి. నేరం రుజువై 2ఏళ్లకు పైగా జైలు శిక్ష పడితే వారి పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుంది. లోక్‌సభలో ఇండియా కూటమి బలం తగ్గుతుంది. BJPకి ప్రయోజనం అవుతుంది. కేసులు ఎదుర్కొంటున్నవారిలో అఫ్జల్ అన్సారీ, ధర్మేంద్రయాదవ్, బాబుసింగ్, రాంభువల్ నిషాద్, వీరేంద్రసింగ్, ఇమ్రాన్ మసూద్ ఉన్నారు.
Similar News
News March 23, 2025
EVల బీమాకు భారీగా పెరిగిన డిమాండ్

ఎలక్ట్రిక్ వాహనాల బీమాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 16 రెట్లు పెరిగినట్లు పాలసీబజార్ అంతర్గత డేటా చెబుతోంది. EV కార్ల బీమా పాలసీల వాటా FY23లో కేవలం 0.50%గా ఉండగా, మార్చి 2025 నాటికి 14%కి విస్తరించి 8.2% వద్ద నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, ముంబై సిటీల్లో ఈవీల వాడకం ఎక్కువగా ఉందని, 55% బీమా పాలసీలు ఈ నగరాల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు పాలసీ బజార్ నివేదిక పేర్కొంది.
News March 23, 2025
యశ్వంత్ వర్మపై విచారణకు కమిటీ

జస్టిస్ <<15855484>>యశ్వంత్ వర్మ<<>> నివాసంలో భారీగా నగదు దొరకడంపై CJI అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్&హర్యానా HC CJ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ HC CJ సంధవాలియా, కర్ణాటక HC CJ అను శివరామన్ ఉన్నారు. ఈ విచారణ సమయంలో వర్మకు ఎలాంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని సీజేఐ ఆదేశించారు. పారదర్శకత కోసం ఢిల్లీ HC CJ రిపోర్ట్‌తో పాటు వర్మ స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
News March 23, 2025
కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

AP: కొత్త DGP ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు IPS అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, మాదిరెడ్డి ప్రతాప్, హారీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ DGPగా ఉన్న హరీశ్ కుమార్‌నే మరో రెండేళ్లు DGPగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.