News June 12, 2024
ఈ ఎన్నికల్లో ‘ఉల్లి’ ఏడిపించింది: సీఎం శిండే
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్సీపీ కూటమి 17 సీట్లకే పరిమితమవడానికి వ్యవసాయ గడ్డు పరిస్థితులే కారణమని సీఎం ఏక్‌నాథ్ శిండే వెల్లడించారు. నాసిక్ ప్రాంతంలో ఉల్లికి మద్దతు ధర దక్కకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నామని, అవి తమను ఏడిపించాయని చెప్పారు. మరాఠ్వాడాలో సోయాబీన్, విదర్భలో పత్తి పంటలు దెబ్బతీశాయన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ను కలిసి పంటలకు మద్దతు ధరపై చర్చిస్తానని తెలిపారు.
Similar News
News December 23, 2024
ప.గో: పార్సిల్‌లోని డెడ్‌బాడీని గుర్తించిన పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజుల నుంచి మిస్టరీగా ఉన్న ఉండి మండలం యండగండి పార్సిల్‌లో డెడ్ బాడీ కేసులో పురోగతి లభించింది. డెడ్‌బాడీ ఎవరిదీ అనేది సోమవారం పోలీసులు గుర్తించారు. కాళ్ల మండలం గాంధీనగర్ చెందిన బర్రె పర్లయ్యగా పోలీసులు గుర్తించారు. అసలు డెడ్‌బాడీని అందులో పార్శిల్ చేసి తులసి ఇంటికి ఎందుకు పంపారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 23, 2024
సంభల్: ఆ మెట్లబావి, సొరంగానికి ‘సిపాయిల తిరుగుబాటు’తో అనుబంధం
UP సంభల్ ఆక్రమణల తొలగింపుతో మన గత చరిత్ర వెలుగుచూస్తోంది. తాజాగా బయటపడ్డ సొరంగం, మెట్లబావి 150 ఏళ్ల క్రితానివని భావిస్తున్నారు. 1857లో బ్రిటిషర్లపై సిపాయిల తిరుగుబాటును ప్రప్రథమ స్వాతంత్ర్య సమరంగా చెప్తారు. అప్పటి సిపాయిలకిది ఎస్కేప్ రూట్‌గా ఉపయోగపడిందని సమాచారం. ఆదివారం ASI టీమ్ సంభల్‌లో 5 పవిత్ర స్థలాలు, 19 బావులను సర్వే చేసింది. తవ్వేకొద్దీ ఇక్కడ మరింత చరిత్ర బయటపడొచ్చని అధికారులు అంటున్నారు.
News December 23, 2024
శ్రీతేజ్ కోలుకోవాలని బన్నీ మృత్యుంజయ యాగం చేయాలి: VH
TG: బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ప్రశ్నించారు. తెలంగాణలో లా&ఆర్డర్ అదుపు తప్పకూడదని సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారని, దీనిపై అల్లు అర్జున్ ఆలోచించాలని సూచించారు. శ్రీతేజ్ కోలుకోవాలని బన్నీ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. BJP, BRSలు శవాల మీద పేలాలు ఏరుకునే రకమని, ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపాలని కోరారు.