News June 12, 2024

గతంలో భూముల ధరల పెంపు ఇలా

image

TG: 2021-22లో వ్యవసాయ భూముల ఎకరం కనిష్ఠ ధరను ప్రభుత్వం ₹75వేలుగా నిర్ధారించింది. తక్కువ ధరలున్న చోట 50%, మధ్య స్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంచింది. ఖాళీ స్థలాలకు ధరలు తక్కువగా ఉన్న చోట 50%, మధ్య స్థాయిలో ఉంటే 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంపు అమలు చేసింది. కొత్త మార్కెట్ విలువలను TG భూముల సవరణ మార్గదర్శకాలు-1998, సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఖరారు చేయనుంది.

Similar News

News December 23, 2024

DHOP మూమెంట్.. స్టార్ హీరోలతో తమన్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబు తమన్ పంచుకున్నారు. ‘DHOP మూమెంట్’ అంటూ తమన్, నా అభిమాన హీరోలంటూ బుచ్చిబాబు రాసుకొచ్చారు. వీరంతా దుబాయ్‌లో ఓ ఈవెంట్ సందర్భంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా RC నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.

News December 23, 2024

FEB 1: సెలవు రోజైనా స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయ్

image

2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్‌కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.

News December 23, 2024

‘నో డిటెన్షన్’ విధానం రద్దు

image

స్కూళ్లలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు KVలు, నవోదయ, సైనిక్ స్కూళ్ల‌కు ఇది వర్తించే అవకాశం ఉంది.