News June 12, 2024

గతంలో భూముల ధరల పెంపు ఇలా

image

TG: 2021-22లో వ్యవసాయ భూముల ఎకరం కనిష్ఠ ధరను ప్రభుత్వం ₹75వేలుగా నిర్ధారించింది. తక్కువ ధరలున్న చోట 50%, మధ్య స్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంచింది. ఖాళీ స్థలాలకు ధరలు తక్కువగా ఉన్న చోట 50%, మధ్య స్థాయిలో ఉంటే 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంపు అమలు చేసింది. కొత్త మార్కెట్ విలువలను TG భూముల సవరణ మార్గదర్శకాలు-1998, సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఖరారు చేయనుంది.

Similar News

News March 26, 2025

బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంపై సిట్: సీఎం రేవంత్

image

TG: బెట్టింగ్ యాప్స్ వివాదంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురిని విచారణకు కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

News March 26, 2025

‘అంతరిక్ష వ్యవసాయం’

image

స్పేస్‌లో జరుగుతున్న పరిశోధనల్లో ఇదీ ఒకటి. ISSకు వెళ్లే వ్యోమగాములకు సరిపడా ఆహారాన్ని ప్రాసెస్డ్ చేసి పంపిస్తుంటారు. అక్కడే వ్యవసాయం చేసుకోగలిగితే వారు స్వయంగా తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతారని ఈ పరిశోధన ఉద్దేశం. అలాగే ఆ మొక్కల నుంచి స్పేస్‌లో ఆక్సిజన్ వెలువడుతుంది. అయితే, స్పేస్‌లో సూర్యరశ్మి, నీరు, ఆక్సిజన్, భూమి లేనప్పటికీ అక్కడ మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.

News March 26, 2025

365 రోజుల్లో ‘ది ప్యారడైజ్’

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజున విడుదల కానుంది. ఇంకా 365రోజులు అంటూ నాని ఓ పోస్టర్‌ను Xలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

error: Content is protected !!