News June 12, 2024

T20WC: 17వ బంతికి ఖాతా తెరిచిన నమీబియా కెప్టెన్

image

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ పరుగులు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. తన మొదటి రన్ సాధించడానికి ఏకంగా 17 బంతులు ఎదుర్కొన్నారు. ఆసీస్ పేసర్ల ధాటికి నమీబియా కెప్టెన్‌తో పాటు ఇతర బ్యాటర్లు కూడా విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 13 ఓవర్లలో 43/8గా ఉంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4, హేజిల్‌వుడ్ 2 వికెట్లతో రాణించారు.

Similar News

News September 12, 2025

నేడు వైస్ ప్రెసిడెంట్‌గా రాధాకృష్ణన్ ప్రమాణం

image

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, NDA కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

News September 12, 2025

త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

image

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

News September 12, 2025

SBIలో 122 ఉద్యోగాలు

image

SBI 122 పోస్టుల భర్తీకి <>అప్లికేషన్లు<<>> స్వీకరిస్తోంది. ఇందులో మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్, ప్రొడక్ట్స్-డిజిటల్ ప్లాట్ ఫామ్స్) పోస్టులు 97, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 25 ఉన్నాయి. డిగ్రీ లేదా MBA/PGDBA/PGDBM/MMS/CA/CFA/ICWA, B.E/B.Tech/MCA పాసవడంతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు అర్హులు. జీతం మేనేజర్‌కు నెలకు ₹85K-1.05L, డిప్యూటీ మేనేజర్‌కు ₹64K-93K ఉంటుంది. దరఖాస్తుకు లాస్ట్ డేట్: OCT 2.