News June 12, 2024
T20WC: 17వ బంతికి ఖాతా తెరిచిన నమీబియా కెప్టెన్

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ పరుగులు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. తన మొదటి రన్ సాధించడానికి ఏకంగా 17 బంతులు ఎదుర్కొన్నారు. ఆసీస్ పేసర్ల ధాటికి నమీబియా కెప్టెన్‌తో పాటు ఇతర బ్యాటర్లు కూడా విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 13 ఓవర్లలో 43/8గా ఉంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4, హేజిల్‌వుడ్ 2 వికెట్లతో రాణించారు.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.