News June 12, 2024
నాలుగో సారి ముఖ్యమంత్రిగా..
AP: 28 ఏళ్లకే ఎమ్మెల్యే. 30 ఏళ్లకు మంత్రి. 45 ఏళ్లకు ముఖ్యమంత్రి. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇది. 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు.. 13 ఏళ్ల 244 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నేడు నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆయనకు రాజధాని రూపంలో పెద్ద సవాల్ ముందుంది. దీంతో ఈసారి చంద్రబాబు పాలన మార్క్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 14, 2025
పండగ వేళ తగ్గిన బంగారం ధరలు
సంక్రాంతి పండగ వేళ ప్రీషియస్ మెటల్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.79,960 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. వెండి కిలో రూ.2000 పడిపోయి రూ.1,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.26,540 వద్ద ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ధరల్లో అనిశ్చితి తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
News January 14, 2025
ఫ్యామిలీతో చెర్రీ సెలబ్రేషన్స్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.
News January 14, 2025
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు BIG షాక్!
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కష్టకాలం మొదలైనట్టే! 2025లో మిడ్ లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఇతర కంపెనీలూ ఇదే బాటలో నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్‌ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. కోడ్ రాయగలిగే AIను మోహరిస్తున్నామని వెల్లడించారు.