News June 12, 2024
నాలుగో సారి ముఖ్యమంత్రిగా..

AP: 28 ఏళ్లకే ఎమ్మెల్యే. 30 ఏళ్లకు మంత్రి. 45 ఏళ్లకు ముఖ్యమంత్రి. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇది. 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు.. 13 ఏళ్ల 244 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నేడు నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆయనకు రాజధాని రూపంలో పెద్ద సవాల్ ముందుంది. దీంతో ఈసారి చంద్రబాబు పాలన మార్క్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News March 20, 2025
మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్.. స్పందించిన ఎన్వీఎస్ రెడ్డి

TG: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ విషయం తన దృష్టికి వచ్చిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా సంబంధిత యాడ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు అనైతికమని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్‌ను మెట్రోలో నిషేధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
News March 20, 2025
ఆర్సీబీ వదిలేశాక భావోద్వేగానికి లోనయ్యాను: సిరాజ్

ఆర్సీబీ నుంచి వేరయ్యాక తాను భావోద్వేగానికి లోనయ్యానని పేసర్ సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్ ఈరోజు ఇలా ఉండటం వెనుక విరాట్ కీలక పాత్ర పోషించారు. 2018-19 మధ్యకాలంలో నేను కష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాలా మద్దతునిచ్చారు. ఆ తర్వాతే నా ప్రదర్శన మెరుగై నా కెరీర్ గ్రాఫ్ మారింది. వచ్చే నెల 2న RCBతో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. వేలంలో ఆయన్ను గుజరాత్ దక్కించుకుంది.
News March 20, 2025
భారత్‌కు సొంతంగా బ్రౌజర్!

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్‌కు ఇదో సదవకాశం. బ్రౌజర్‌కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.