News June 12, 2024
దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 12 నెలల కనిష్ఠానికి తగ్గి 4.75శాతంగా నమోదైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.28%, అర్బన్ ఏరియాల్లో 4.15%గా ఉంది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఇన్ఫ్లేషన్ ఏప్రిల్లో 4.83%గా రికార్డ్ అయింది. కొన్ని నెలలుగా ఆందోళన కలిగిస్తున్న ఆహార ద్రవ్యోల్బణమూ మే నెలలో 8.75 నుంచి 8.62%కు చేరి ఊరట కలిగించింది. అయితే 2023 మేలో రికార్డ్ అయిన 3.3% కంటే ఇది ఎక్కువే.
Similar News
News December 29, 2024
నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?
TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News December 29, 2024
జనవరి 1న సెలవు లేదు
జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.
News December 29, 2024
హైదరాబాద్లో మన్మోహన్ విగ్రహం?
TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు హైదరాబాద్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రధాన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఉంటుందని సమాచారం. అదే విధంగా ఏదైనా పథకానికి కూడా మన్మోహన్ పేరును పెట్టొచ్చని తెలుస్తోంది. రేపు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది.