News June 13, 2024
USపై గెలుపు.. సూపర్-8కు భారత్

T20WCలో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-Aలో హ్యాట్రిక్ గెలుపులతో రోహిత్ సేన సూపర్-8కు చేరింది. ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత US 110/8 స్కోరు చేయగా, టీమ్ ఇండియా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. రోహిత్ 3, కోహ్లి 0, పంత్ 18, సూర్య 50*, శివమ్ దూబే 31* పరుగులు చేశారు.
Similar News
News November 8, 2025
నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం
News November 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 8, 2025
JIO: ఉచితంగా జెమినీ ఏఐ ప్రో ప్లాన్!

ఇప్పటివరకు 18-25 ఏళ్ల మధ్య వారికే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్‌ను ఇప్పుడు 25ఏళ్లు పైబడిన వారికీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. My Jio యాప్‌లో దీన్ని క్లైమ్ చేసుకోవచ్చు. ఇందుకు 5G ప్లాన్ యాక్టివేటై ఉండాలి. దీని ద్వారా రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్ 18నెలల పాటు ఫ్రీగా పొందొచ్చు. ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి.


