News June 13, 2024

USపై గెలుపు.. సూపర్-8కు భారత్

image

T20WCలో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-Aలో హ్యాట్రిక్ గెలుపులతో రోహిత్ సేన సూపర్-8కు చేరింది. ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత US 110/8 స్కోరు చేయగా, టీమ్ ఇండియా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. రోహిత్ 3, కోహ్లి 0, పంత్ 18, సూర్య 50*, శివమ్ దూబే 31* పరుగులు చేశారు.

Similar News

News March 22, 2025

ట్రంప్ ఎఫెక్ట్..5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు

image

USAలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. వచ్చే నెల 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుంది. యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు.

News March 22, 2025

ఎంపురాన్ కోసం హీరో, డైరెక్టర్ కీలక నిర్ణయం

image

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘L2:ఎంపురాన్’. <<15821261>>ట్రైలర్‌తోనే<<>> ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కోసం తాను, మోహన్ లాల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఆ మొత్తాన్ని మూవీ క్వాలిటీ కోసం వెచ్చించినట్లు చెప్పారు. మలయాళ సినీ పరిశ్రమ చిన్నదైనా టాప్ టైర్ ప్రొడక్షన్ క్వాలిటీతో సినిమాలు చేస్తున్నామన్నారు.

News March 22, 2025

నిన్న నైట్ ఏం చేశారు డ్యూడ్..?

image

ఎప్పట్లాగే AP, తెలంగాణలో నిన్న సాయంత్రం తర్వాత అంతా ఇళ్లకు చేరారు. అనంతరం APలో చూస్తే ఉదయం నుంచి బయట వేడికి తోడు రాత్రి ఇంట్లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి. ఇక తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం, రాత్రి, కరెంట్ కట్ కాంబోగా కలిసొచ్చాయి. ఇక హైదరాబాద్‌లో మిడ్‌నైడ్ భీకర ఉరుములు, మెరుపులతో వర్షం. సీన్ కట్ చేస్తే.. కరెంట్ కట్. భిన్న కారణాలతో AP, TGలో కామన్ మ్యాన్‌కు కామన్‌గా కునుకు లేదు. మీకు ఎలా ఉంది? కామెంట్!

error: Content is protected !!