News June 13, 2024

ATM వినియోగదారులకు షాక్?

image

ఇతర బ్యాంకు ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రాపై కస్టమర్లకు విధించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని ATM ఆపరేటర్లు RBIని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ ట్రాన్సాక్షన్‌కు రూ.21గా ఉన్న ఛార్జీని రూ.23కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. చివరగా 2021లో కేంద్రం ఛార్జీలను పెంచింది. ప్రస్తుతం మెట్రో నగరాల్లో నెలకు మూడు విత్‌డ్రాలు, మిగతా చోట్ల ఐదు విత్‌డ్రాలకు బ్యాంకులు ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నాయి.

Similar News

News November 1, 2025

మహిళలకు నివాస హక్కు

image

ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఫ్రమ్‌ డొమెస్టిక్‌ వయొలెన్స్‌, 2005 ప్రకారం, ఒక మహిళ తన వైవాహిక లేదా ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును కలిగి ఉంది. ఆమె సొంతం కాకపోయినా లేదా ఆమె పేరు రెంటల్‌ అగ్రిమెంట్‌లో లేకపోయినా ఆమె అక్కడ నివసించే హక్కు ఉంటుంది. ఆమె భర్త లేదా అత్తమామలు ఆమెను చట్టబద్ధంగా వెళ్ళగొట్టలేరు.

News November 1, 2025

ఈ వృక్షాన్ని పూజిస్తే.. కుబేరుడి అనుగ్రహం

image

పవిత్ర ప్రబోధిని ఏకాదశి రోజున కదంబ వృక్షాన్ని పూజిస్తే విష్ణువు కటాక్షం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవతా వృక్షం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆయన ఈ చెట్టు కిందే వేణువు వాయించేవాడని పురాణాల వాక్కు. అందుకే ఈ చెట్టుకు ప్రభోధిని ఏకాదశి రోజున పూజ చేయాలని చెబుతారు. పసుపు, పువ్వులు సమర్పించి భక్తితో పూజిస్తే అదృష్టంతో పాటు కుబేరుడి అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

News November 1, 2025

POKలో మానవహక్కుల ఉల్లంఘన: UNలో భారత్ ఫైర్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో ప్రజల తిరుగుబాటును అక్కడి దళాలు అణచివేస్తున్నాయని UN వేదికగా భారత్ ఫైరయ్యింది. అక్కడ తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని IND దౌత్యవేత్త భావికా మంగళానందన్ ధ్వజమెత్తారు. అక్కడి దారుణాలను ఆపకుండా భారత్‌పై నిందలు మోపేందుకు ఆ దేశ దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాక్ కపట వైఖరి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.