News June 13, 2024
ATM వినియోగదారులకు షాక్?
ఇతర బ్యాంకు ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రాపై కస్టమర్లకు విధించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని ATM ఆపరేటర్లు RBIని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ ట్రాన్సాక్షన్‌కు రూ.21గా ఉన్న ఛార్జీని రూ.23కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. చివరగా 2021లో కేంద్రం ఛార్జీలను పెంచింది. ప్రస్తుతం మెట్రో నగరాల్లో నెలకు మూడు విత్‌డ్రాలు, మిగతా చోట్ల ఐదు విత్‌డ్రాలకు బ్యాంకులు ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నాయి.
Similar News
News September 20, 2024
Learning English: Synonyms
✒ Gross: Improper, Rude, Coarse
✒ Happy: Pleased, Contented
✒ Hate: Despise, Loathe, Abhor
✒ Have: Acquire, Gain, Maintain
✒ Help: Aid, Assist, Succor
✒ Hide: Conceal, Shroud, Veil
✒ Hurry: Hasten, Urge, Accelerate
✒ Hurt: Distress, Afflict, Pain
✒ Idea: Thought, Concept, Notion
News September 20, 2024
బీజేపీ ఎంపీ రఘునందన్‌పై హైకోర్టు ఆగ్రహం
TG: మెదక్ BJP MP రఘునందన్‌రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్‌కు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించింది.
News September 20, 2024
మాతృత్వంతో ఆనందం, ఆందోళన: అలియా భట్
తల్లి అయిన తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ సాధ్యం కావట్లేదని హీరోయిన్ అలియా భట్ చెప్పారు. తనకంటూ సమయం వెచ్చించలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాతృత్వం ఆనందంగానే ఉన్నా ఆందోళన కూడా ఉందన్నారు. కూతురు రాహా అల్లరి, చిలిపి పిల్ల అని మురిసిపోయారు. 2022 నవంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 11న ఇది విడుదల కానుంది.