News June 13, 2024

చరిత్ర సృష్టించనున్న నిర్మలమ్మ

image

మోదీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు ముంగిట ఉన్నారు. వరుసగా 7సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. తద్వారా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాస్తారు. వీరిద్దరూ 5పూర్తి స్థాయి, 1 మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. కాగా ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Similar News

News July 3, 2024

భారత్ తన బ్రాండ్ నిలబెట్టుకుంది: పాక్ క్రికెటర్

image

T20 WC గెలిచి మరోసారి టీమ్ ఇండియా తన బ్రాండ్ నిలబెట్టుకుందని పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. ‘ఫైనల్‌లో రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు రాణిస్తుందో అదే ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఫైనల్లో టీమ్ ఇండియా ఒత్తిడిని జయించి విజేతగా నిలిచింది. కప్ అందుకునేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News July 3, 2024

హేమంత్ సోరెన్‌కు మళ్లీ సీఎం పగ్గాలు?

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు ఇవాళ ఆయనను శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా చంపై సోరెన్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

News July 3, 2024

రండి.. ఈ అపురూప విజయాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం: రోహిత్

image

ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగే విక్టరీ పరేడ్‌కు రావాలని కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. దీంతో 2007 T20 WC బస్ పరేడ్‌ను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. MS ధోనీ సారథ్యంలోని ఇండియన్ టీమ్ 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచి స్వదేశానికి తిరిగివచ్చింది. వీరిని స్వాగతించేందుకు వేలాది మంది తరలివచ్చారు. అయితే ఇంతకంటే ఎక్కువ మంది రేపు పరేడ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.