News June 13, 2024
చరిత్ర సృష్టించనున్న నిర్మలమ్మ
మోదీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు ముంగిట ఉన్నారు. వరుసగా 7సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. తద్వారా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాస్తారు. వీరిద్దరూ 5పూర్తి స్థాయి, 1 మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. కాగా ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Similar News
News September 10, 2024
ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం
AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈనెల 1న ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.
News September 10, 2024
వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం: హోంమంత్రి
AP: ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయని హోంమంత్రి అనిత తెలిపారు. ‘బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. ఇది మానవ చర్యే. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి. కావాలనే వాటిని కొట్టుకువచ్చేలా చేశారు. అవి తలశిల రఘురాం, నందిగం సురేశ్ బంధువులకు చెందినవిగా గుర్తించాం. విచారణలో తేలితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతాం’ అని అన్నారు.
News September 10, 2024
దులీప్ ట్రోఫీ జట్లలో మార్పులు
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టుల కోసం జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో రెండో రౌండ్ కోసం ఇండియా-C మినహా మిగతా 3 జట్లలో బీసీసీఐ మార్పులు చేసింది. ఇండియా-A కెప్టెన్‌గా గిల్ స్థానంలో మయాంక్‌ను నియమించింది. జైస్వాల్, పంత్ స్థానంలో ఇండియా-Bకి రింకూ సింగ్, ప్రభుదేశాయ్‌ను, అక్షర్ పటేల్ స్థానంలో ఇండియా-Dకి నిషాంత్ సింధును సెలక్ట్ చేసింది. జట్ల పూర్తి వివరాల కోసం ఇక్కడ <