News June 14, 2024
ఫస్ట్ ఎయిడ్ అందించనున్న జొమాటో డెలివరీ ఏజెంట్లు
రోడ్లపై అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించేలా తమ డెలివరీ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆహార డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ దీపీందర్ గోయల్ ట్విటర్‌లో ప్రకటించారు. ‘నిన్న ముంబైలో 4300మంది డెలివరీ పార్టనర్లకు ఫస్ట్ ఎయిడ్ పాఠాలు నిర్వహించి మేం గిన్నిస్ రికార్డ్ బద్దలుగొట్టాం. ఇప్పుడు అత్యవసర సమయాల్లో 30వేలమంది జొమాటో ఏజెంట్లు వైద్య సహాయం అందించగలరు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 15, 2025
BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట
AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.
News January 15, 2025
గేమ్ ఛేంజర్ NETT కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా 5 రోజుల్లో ₹100కోట్ల NETT కలెక్షన్స్ సాధించినట్లు ఇండియా టుడే తెలిపింది. తొలి రోజు ₹51కోట్లు, తర్వాతి 4 రోజుల్లో వరుసగా ₹21.6కోట్లు, ₹15.9కోట్లు, ₹7.65కోట్లు, ₹10 కోట్లు వసూలు చేసిందని పేర్కొంది. మొత్తం <<15125676>>NETT<<>> వసూళ్లు ₹106.15 అని పేర్కొంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 10న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
News January 15, 2025
BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.