News June 14, 2024

ఫస్ట్ ఎయిడ్ అందించనున్న జొమాటో డెలివరీ ఏజెంట్లు

image

రోడ్లపై అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించేలా తమ డెలివరీ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆహార డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ దీపీందర్ గోయల్ ట్విటర్‌లో ప్రకటించారు. ‘నిన్న ముంబైలో 4300మంది డెలివరీ పార్టనర్లకు ఫస్ట్ ఎయిడ్ పాఠాలు నిర్వహించి మేం గిన్నిస్ రికార్డ్ బద్దలుగొట్టాం. ఇప్పుడు అత్యవసర సమయాల్లో 30వేలమంది జొమాటో ఏజెంట్లు వైద్య సహాయం అందించగలరు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 13, 2024

నేడు పిఠాపురానికి వైఎస్ జగన్

image

AP: వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం రానున్నారు. నియోజకవర్గంలోని మాధవపురం, రమణక్కపేటలో ప్రజలు, రైతులతో సమావేశమవుతారు. అలాగే ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమై నీటమునిగిన పొలాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.

News September 13, 2024

మూత్రం, మురుగు నీటి నుంచి బీర్‌ తయారీ!

image

సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్‌ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్‌’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.

News September 13, 2024

పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్.. గరిష్ఠంగా రూ.10 వేలే సబ్సిడీ: కేంద్రమంత్రి

image

విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం PM ఈ-డ్రైవ్ స్కీమ్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. కాగా స్కీమ్ కింద తొలి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రెండో ఏడాది గరిష్ఠంగా రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఇ-రిక్షాలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.12,500 అందిస్తామన్నారు.