News June 14, 2024

పాత DSC రద్దు!

image

AP: వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.

Similar News

News September 13, 2025

తిరుమల: భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 69,842 మంది స్వామివారిని దర్శించుకోగా.. 28,234 మంది తలనీలాలు సమర్పించారు.

News September 13, 2025

మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల

image

TG: 4,079 మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.11 కోట్ల రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేసింది. ఒక్కో సంఘానికి రూ.15,000 కేటాయించనుంది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షిస్తాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 397 సంఘాలకు, అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో 3 సంఘాలకు నిధులు అందనున్నట్లు సమాచారం.

News September 13, 2025

ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

image

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.