News June 14, 2024
పాత DSC రద్దు!
AP: వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
Similar News
News September 15, 2024
PHOTO: కోహ్లీ షాట్‌కు గోడకు రంధ్రం
బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ జోరు పెంచారు. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే తొలి టెస్టుకు కింగ్ కోహ్లీ నెట్స్‌లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో విరాట్ కొట్టిన ఓ బంతి వేగానికి డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని గోడకు పెద్ద రంధ్రం పడింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తొలి టెస్టులోనూ కోహ్లీ ఇలాంటి దూకుడునే ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News September 15, 2024
రేపు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
TG: రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పాల్గొంటారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాగా కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక రావట్లేదని సమాచారం.
News September 15, 2024
అట్లీ-అల్లు అర్జున్ కాంబో.. బిగ్ అప్డేట్?
అల్లు అర్జున్, అట్లి కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ నిర్మించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్‌తో సంయుక్తంగా సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న విడుదల కానుంది.