News June 14, 2024
ప్రజలకు కూర‘గాయాలు’.. భారీగా పెరిగిన ధరలు
TG: కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న కిలో ఉల్లి ₹20 పలకగా ఇప్పుడు ₹40-50కి చేరింది. టమాటా ₹60-90, వంకాయ ₹40-50, పచ్చి మిర్చి ₹80-120 ధర పలుకుతోంది. బీన్స్, క్యారట్, బీట్‌రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.
Similar News
News December 26, 2024
రేపు కర్ణాటకకు సీఎం రేవంత్
TG: కర్ణాటకలోని బెలగావిలో గురువారం నుంచి జరిగే CWC సమావేశాల్లో పాల్గొనేందుకు CM రేవంత్ వెళ్లనున్నారు. ఉదయం 11 తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఆయన బెలగావికి పయనమవుతారు. వందేళ్ల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీజీ బెలగావిలోనే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘సత్యాగ్రహ బైఠక్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. గురు, శుక్రవారాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.
News December 26, 2024
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమే బెస్ట్: మోహన్ లాల్
ప్రస్తుతం దేశంలో తెలుగు సినీ పరిశ్రమే అగ్రస్థానంలో ఉందని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. టాలెంట్‌ను టాలీవుడ్ ప్రోత్సహిస్తుంటుందని ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ సరిహద్దుల్ని తెలుగు సినిమా చెరిపేస్తోందని ఆయన ప్రశంసించారు. అవకాశం దక్కితే <<14978053>>మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తానంటూ<<>> ఆయన ఇప్పటికే అభిలాషను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News December 26, 2024
మళ్లీ రిలీజవుతున్న ‘గుంటూరు కారం’
మహేశ్ బాబు గత మూవీ ‘గుంటూరు కారం’ అంతంతమాత్రంగానే ఆడింది. సోషల్ మీడియాలో మాత్రం మూవీ గురించి మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఆ సినిమాను డిసెంబరు 31న పరిమిత స్క్రీన్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈసారి మాత్రం సీట్లన్నీ చకాచకా నిండిపోతుండటం విశేషం. ఈ ఆదరణ కొనసాగితే స్క్రీన్ల సంఖ్యను మరింత పెంచాలని మూవీ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం.