News June 14, 2024
ప్రజలకు కూర‘గాయాలు’.. భారీగా పెరిగిన ధరలు
TG: కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న కిలో ఉల్లి ₹20 పలకగా ఇప్పుడు ₹40-50కి చేరింది. టమాటా ₹60-90, వంకాయ ₹40-50, పచ్చి మిర్చి ₹80-120 ధర పలుకుతోంది. బీన్స్, క్యారట్, బీట్‌రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.
Similar News
News September 9, 2024
బాహుబలి-2, పఠాన్ రికార్డులు బ్రేక్ చేసిన ‘స్త్రీ-2’
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ-2’ సినిమా జోరు కొనసాగుతోంది. హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. రూ.584 కోట్లతో జవాన్ అగ్రస్థానంలో ఉండగా, స్త్రీ-2(రూ.551 కోట్లు) సెకండ్ ప్లేస్‌లో ఉంది. త్వరలోనే నంబర్-1కు చేరే అవకాశం ఉంది. 3, 4, 5 స్థానాల్లో గదర్-2(రూ.527 కోట్లు), పఠాన్(రూ.524 కోట్లు), బాహుబలి-2(రూ.511 కోట్లు) ఉన్నాయి.
News September 9, 2024
వాళ్ల ఫస్ట్ టార్గెట్ బీజేపీ ఆఫీస్: NIA
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజే బెంగళూరులోని BJP ఆఫీసుపై నిందితులు ఐఈడీ దాడికి విఫలయత్నం చేశారని పేర్కొంది. తొలి టార్గెట్ మిస్ అవడంతో ఆ తర్వాత రామేశ్వరం కేఫ్ పేలుడికి ప్లాన్ చేశారంది. ఈ కేసులో నలుగుర్ని నిందితులుగా పేర్కొన్న NIA, అందులో ఇద్దరు ఐసిస్ రాడికల్స్ అని తెలిపింది.
News September 9, 2024
గ్రీన్ ఫార్మా సిటీ ప్రక్రియపై సీఎం రేవంత్ సమీక్ష
HYD శివారులోని ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలని చెప్పారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించే ప్రక్రియ వేగంగా జరగాలని సమీక్షలో దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే సంప్రదింపులు జరపాలని సూచించారు.