News June 14, 2024

కవితతో కేటీఆర్ ములాఖత్

image

TG: తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితపై సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా అప్పటి నుంచి జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

Similar News

News January 16, 2025

4 కొత్త పథకాలు.. సీఎస్ కీలక ఆదేశాలు

image

TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులను గుర్తించి జాబితాలను ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. GHMCలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

News January 15, 2025

చదువుతో పనిలేదు.. మీ వర్క్ పంపండి: ఎలాన్ మస్క్

image

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు. చదువుతో సంబంధం లేకుండా వారు తయారుచేసిన బెస్ట్ వర్క్‌ను పంపి తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘మీరు అసలు స్కూల్‌కు వెళ్లకపోయినా, చదవకపోయినా, పెద్ద కంపెనీలో పనిచేయకపోయినా మేం పట్టించుకోం. మీరు everything app(మస్క్ డ్రీమ్ యాప్) రూపొందించాలనుకుంటే మీ బెస్ట్ వర్క్‌ను code@x.comకి పంపండి’ అని ట్వీట్ చేశారు.

News January 15, 2025

చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే: CM రేవంత్

image

TG: రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ, GRMB, KRMB, AP CMకు లేఖలు రాయాలని చెప్పారు.