News January 15, 2025
చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే: CM రేవంత్

TG: రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ, GRMB, KRMB, AP CMకు లేఖలు రాయాలని చెప్పారు.
Similar News
News February 19, 2025
బంగారం ధరలు పైపైకి!

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.80,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 పెరగడంతో రూ.87,650లకు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది.
News February 19, 2025
సీబీఎస్ఈ కీలక నిర్ణయం

సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ తరహాలో ఏడాదిలో రెండు సార్లు పరీక్ష నిర్వహణను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 24న ముసాయిదాను విడుదల చేయనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని తెలిపింది.
News February 19, 2025
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.