News June 14, 2024

మీ ట్రోలింగ్‌కి థాంక్స్: దర్శన్ కుమారుడు

image

కన్నడ నటుడు దర్శన్‌పై వస్తున్న విమర్శల పట్ల ఆయన కుమారుడు వినీశ్ దర్శన్ ఇన్‌స్టాలో స్పందించారు. ‘నేను 15 ఏళ్ల పిల్లాడినని మరచిపోయి మరీ మా నాన్నపై తప్పుడు కామెంట్స్ పెడుతున్నవారందరికీ థాంక్స్. ఇలాంటి కష్టకాలంలో మా అమ్మనాన్నలకు మద్దతు కావాలి. నన్ను ద్వేషించడం వలన ఏమీ మారదు’ అని పేర్కొన్నారు. అభిమానిని చంపిన కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News December 26, 2024

మంత్రులు, అధికారులతో సీఎం సమావేశం

image

సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పోలీస్ కమాండ్ సెంటర్ (CCC)లో నిర్మాతలు, దర్శకులు, నటులతో సీఎం భేటీ కానున్నారు.

News December 26, 2024

బాక్సింగ్ డే: ముగ్గురు బ్యాటర్లు అర్ధసెంచరీలు

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్లు కోన్ట్సస్(60), ఖవాజా(57) అర్ధసెంచరీలతో రాణించారు. టీ విరామం తర్వాత లబుషేన్(61*) కూడా అర్ధసెంచరీ పూర్తి చేశారు. మరో బ్యాటర్ స్మిత్(30*) క్రీజులో ఉన్నారు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.

News December 26, 2024

మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్యం విషమం

image

TG: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజుల క్రితం గుండె పోటుకు గురవ్వగా నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నాయకులు ఆయనను పరామర్శించారు.