News June 14, 2024
మీ ట్రోలింగ్‌కి థాంక్స్: దర్శన్ కుమారుడు
కన్నడ నటుడు దర్శన్‌పై వస్తున్న విమర్శల పట్ల ఆయన కుమారుడు వినీశ్ దర్శన్ ఇన్‌స్టాలో స్పందించారు. ‘నేను 15 ఏళ్ల పిల్లాడినని మరచిపోయి మరీ మా నాన్నపై తప్పుడు కామెంట్స్ పెడుతున్నవారందరికీ థాంక్స్. ఇలాంటి కష్టకాలంలో మా అమ్మనాన్నలకు మద్దతు కావాలి. నన్ను ద్వేషించడం వలన ఏమీ మారదు’ అని పేర్కొన్నారు. అభిమానిని చంపిన కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 7, 2024
క్విక్ కామర్స్.. విగ్రహాలు, మామిడి ఆకులూ ఇందులోనే..
నగరాలు, పట్టణాల్లో క్విక్ కామర్స్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి కంపెనీలు 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతో కొందరు వినియోగదారులు అటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ వినాయక చవితికి కావాల్సిన విగ్రహాలు, పత్రులు, పుష్పాలు, మామిడి ఆకులు, కుంకుమ.. ఇలా ప్రతి ఒక్క వస్తువును విక్రయించారు. వీటితో కిరాణాషాపులు, వీధి వ్యాపారులపై ప్రభావం పడుతోంది.
News September 7, 2024
నేను కాంగ్రెస్‌లో సంతోషంగా ఉన్నా: జగ్గారెడ్డి
TG: TPCC నూతన అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌ను నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ‘రెడ్డి వర్గానికి పదవి ఇవ్వాలనుకుంటే జగ్గారెడ్డి చర్చలోకి వస్తాడు. నేను కాంగ్రెస్‌లో సంతోషంగానే ఉన్నా. సామాన్యుడైన మహేశ్ కుమార్‌కు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం’ అని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన వినాయకచవితి వేడుకల్లో జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పోస్టులపై తాను చర్చించనని అన్నారు.
News September 7, 2024
మండపాల్లో కరెంట్ షాక్.. నలుగురు మృతి
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన మండపాల్లో కరెంట్ షాక్‌తో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. APలోని రాయచోటిలో మహేశ్(13), పల్నాడులో దేవసహాయం, TGలోని కుత్బుల్లాపూర్‌లో నవీన్, హుజురాబాద్‌లో యశ్వంత్ మరణించారు. వేములవాడలోని కొనాయ్యపల్లిలో ఇద్దరికి గాయాలయ్యాయి.
NOTE: వర్షాలు కురుస్తున్నందున మండపాల్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కాకుండా అప్రమత్తంగా ఉండండి.