News June 14, 2024

ఆ సినిమాల జోలికి వెళ్లను: RGV

image

పొలిటికల్ సినిమాలు తీయనని ఇప్పటికే ప్రకటించిన రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఆ మాటను నొక్కి చెప్పారు. కొత్త దర్శకులను పరిచయం చేసే ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పొలిటికల్ బయోపిక్స్ జోలికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. కాగా వ్యూహం, శపథం వంటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను ఆయన తీశారు. ఇవి చంద్రబాబు, లోకేశ్, పవన్‌ను ఉద్దేశించే తీశారంటూ ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

Similar News

News December 26, 2024

కోడలు శోభిత గురించి నాగార్జున ఏమన్నారంటే?

image

నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ పరిచయం కంటే ముందే తనకు ఆమె తెలుసని నాగార్జున చెప్పారు. ఆమె ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కోడలి వ్యక్తిత్వం, పనిలో నిజాయితీని కొనియాడారు. ఆమె వర్క్‌లో క్వాంటిటీ కంటే క్వాలిటీని చూస్తారన్నారు. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారన్నారు. ‘చైతూ జీవితంలోకి శోభిత వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News December 26, 2024

టాలీవుడ్‌ను రేవంత్ టార్గెట్‌గా చేసుకున్నారు: అమిత్ మాలవీయ

image

CM రేవంత్ రెడ్డిపై BJP IT సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అదుపాజ్ఞల్లో ఉండనందుకు, డబ్బు ఇవ్వనందుకు తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ కక్షగట్టారని మండిపడ్డారు. ‘రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు టాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుంది. తెలుగు స్టార్లు, నిర్మాతలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ సర్కారు చెడ్డపేరును మూటగట్టుకుంది’ అని విమర్శించారు.

News December 26, 2024

సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దు: భట్టి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలివచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైజింగ్‌లా బిజినెస్ మోడల్‌ని తీసుకెళ్దామని పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో సినీ పరిశ్రమ కలిసి రావాలని పిలుపునిచ్చారు.